Monday, January 20, 2025

యాక్షన్ మూడ్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు: నాని

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జె సూర్య పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ అడ్రినలిన్ ఫిల్ యాక్షన్- అడ్వెంచర్ గురువారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నేచురల్ స్టార్ నాని మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

రిఫ్రెషింగ్‌గా అనిపించింది…
సరిపోదా శనివారం సినిమా నాకు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. సాధారణంగా నా సినిమాలన్నింటిలో తెలియని ఒక బరువుని మోస్తుంటాను. అది ఈసారి ఎస్‌జె సూర్య మీద, వివేక్ మీద వుంది. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాను. పర్ఫార్మెన్స్ పరంగా ఎస్‌జె సూర్య, ప్రియాంక, మురళీశర్మ.. ఇలా అందరిపై భారం వుంది.
చాలా ఎంజాయ్ చేశాను…
ఎస్‌జె సూర్యతో కలసి నటించడం చాలా ఎంజాయ్ చేశాను. ఆ రోల్‌కి ఆయన తప్పితే మరో చాయిస్ లేదు. డబ్బింగ్ దాదాపు ఏడు రోజులు చెప్పారు. అద్భుతంగా వచ్చింది. తన డబ్బింగ్ కోసం మరో రెండుసార్లు సినిమా చూస్తారు.
మంచి కథ ఇది…
సరిపోదా శనివారం చాలా మంచి కథ. అడ్రినలిన్ పంపింగ్ మూమెంట్స్ వుంటాయి. కథ ప్రకారం ఆ అడ్రినలిన్ పంపింగ్ వందశాతానికి తీసుకెళ్ళాం. సినిమా చాలా ఆర్గానిక్‌గా కుదిరింది. థియేటర్స్‌లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
తన మ్యాజిక్ చూస్తారు…
ఇది చాలా రేసీ ఫిలిం. నెరేటివ్ కూడా రేసీగా వుంటుంది. సినిమా పరిగెడుతుంటుంది. సాధారణంగా సినిమాల్లో హీరోకి ఇంట్రో సాంగ్ వుంటుంది. తర్వాత మేలోడీలు, ఎమోషనల్ సాంగ్స్ వస్తాయి. కానీ జేక్స్ బిజోయ్ మొత్తం సినిమాని హీరో ఇంట్రో సాంగ్‌లా కొట్టాడు. తన మ్యాజిక్ గురువారం చూస్తారు.
నా ఫేవరేట్ మూమెంట్ అది…
ఈ సినిమాకి సరిపోదా శనివారమే అని టైటిల్ పెట్టడానికి అదిరిపోయే కారణం వుంది. నా ఫేవరేట్ మూమెంట్ అది. సినిమా ప్రారంభమయ్యే ఐదు నిమిషాలకి వస్తుంది.
స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా…
ఈ సినిమాలో 20 శాతం యాక్షన్, 80 శాతం యాక్షన్ మూడ్ వుంటుంది. ఇందులో యాక్షన్ మూడ్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ‘సరిపోదా శనివారం’ స్క్రీన్ ప్లే, నెరేటివ్ చాలా ఆసక్తికరంగా వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News