Monday, December 23, 2024

నవ్వులు పూయించిన నాని

- Advertisement -
- Advertisement -

Nani acting new film in priest

 

మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన రామ్-కామ్ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయినందున వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఈ చిత్రం. నానికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా టీమ్ ‘అంటే సుందరానికి’ బర్తడే హోమాన్ని ఆవిష్కరించింది.

ఈ వీడియో వాస్తవానికి సినిమాలోని నాని పాత్ర గురించి స్నీక్ పీక్ ఇస్తుంది. అతను తన కుటుంబం కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొనే అమాయక బ్రాహ్మణుడు. అతని జీవితంలో అనేక గండాలు (చెడు సంఘటనలు) ఉన్నందున వారు అతనిని ఇంటిలో చాలా తరచుగా హోమం చేయమని బలవంతం చేస్తారు. చిన్నపిల్లాడిలా అమ్మా, అమ్మమ్మతో వాదించేవాడు. వివేక్ ఆత్రేయ నవ్వించే ఎంటర్‌టైనర్‌లను హ్యాండిల్ చేయడంలో తన నైపుణ్యాన్ని నిరూపించుకుంటే, నాని తన నటనతో నవ్వులు పూయించాడు. ఈ చిత్రంలో నాని పూర్తి వినోదాత్మక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ ఫహద్ హీరోయిన్‌గా నటించింది. ‘అంటే సుందరానికి’ జూన్ 10న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News