Sunday, April 27, 2025

హీరోయిన్ తో కలిసి కాలి నడకన తిరుమలకు నాని..

- Advertisement -
- Advertisement -

నాచురల్ స్టార్ నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న వీరికి టిటిడి అధికారులు స్వాగతం పలికారు. ఆదివారం వేకువజామున నాని, శ్రీనిధి.. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని… అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వీరిని పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో తెరకుక్కిన హర్రర్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. శైలేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తమ సినిమా సక్సెస్ కావాలని శ్రీవారిని దర్శించుకునేందు తిరుమలకు వచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News