Sunday, December 22, 2024

కుటుంబ సమేతంగా శ్రీవారికి మెుక్కులు చెల్లించుకున్న నటుడు నాని

- Advertisement -
- Advertisement -

తిరుపతి: టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థాయిని నిర్మించుకున్న నటుడు నాని, కుటుంబ సమేతంగా తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. విశేషమేమిటంటే నాని వెంట నటి ప్రియాంక మోహన్ కూడా  శ్రీవారిని దర్శించుకున్నారు. వారిద్దరూ కలిసి నటించిన సినిమా ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ కు ముందే నాని శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

నాని కుటుంబం శుక్రవారం తిరుపతి చేరుకున్నారు. కాగా వారు అలిపిరి మెట్ల మార్గాన నడిచి కొండపైకి చేరుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత గుడి బయటికి వచ్చాక  అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News