Monday, January 20, 2025

‘హాయ్ నాన్న’ కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ‘హాయ్ నాన్న’ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా కనిపించనుంది.

తాజాగా ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ కూనూర్ పచ్చని అందాలలో ప్రారంభమైయింది. నాని లొకేషన్ నుండి ‘హాయ్’ చెబుతూ ఎక్సోటిక్ లొకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ కోసం సిద్ధంగా ఉండండి. త్వరలోనే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. మేకర్స్ గతంలో విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ నేషనల్ వైడ్ గా మంచి బజ్ ని క్రియేట్ చేసింది.

ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ‘హాయ్ నాన్న’ ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News