Monday, December 23, 2024

నాని గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి

- Advertisement -
- Advertisement -

“నాని నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఎంతో గౌరవం. నాని గొప్ప వ్యక్తి త్వం కలిగిన వ్యక్తి. ‘అంటే సుందరానికీ’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేచురల్ స్టార్ నాని,- నజ్రియా నజీమ్ జంటగా వివే క్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’. పవర్ స్టార్ పవన్ కళ్యా ణ్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ చిత్రం ప్రీ రిలీ జ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ నజ్రియా నజీమ్, నిర్మాత నవీన్ యెర్నేని, చిత్ర బృందంతో పాటు దర్శకుడు సుకుమార్, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్, బుచ్చిబాబు, నివేదా థామస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద ర్భంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ “నాని గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయనికి భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలని కోరుకుంటున్నా ను. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన నజ్రియాని తెలుగు చిత్ర పరిశ్రమకి మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. సినిమాకి వెన్నెముక లాంటి దర్శకుడు వివేక్ ఆత్రేయకి మనస్పూర్తిగా అభినందనలు”అని అన్నారు. హీరో నాని మాట్లాడుతూ “ఈ సినిమా విషయంలో చాలా గర్వంగా వుంది. ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు మేము ఎంత ఎంజాయ్ చేశామో..

సినిమా చూసి ప్రేక్షకులు కూడా అంత ఎంజాయ్ చేస్తే దానికి మించినది ఏమీ లేదు. పవన్‌కళ్యాణ్ వేడుకకు రావడం, అభిమానుల ఎనర్జీ అంతా ఫుల్ పాజిటివ్‌గా వుంది. అప్పుడే ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వైబ్ మొదలైంది. ‘అంటే సుందరానికీ’… ఇట్స్ నాట్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఇట్స్ ఎంజాయ్‌మెంట్‌”అని తెలిపారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ “సినిమా కోసం నా డైరెక్షన్ టీం అంతా రాత్రి పగలు తేడా లేకుండా పని చేశారు. నానికి స్పెషల్ థాంక్స్. ఆయన స్క్రిప్ట్ ఓకే చేయకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు. నజ్రియాకి కూడా థాంక్స్. మైత్రీ మూవీమేకర్స్ లేకపోతే ఈ సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చేది కాదు”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News