Wednesday, March 12, 2025

‘చిరంజీవి నన్ను అలా పిలిచారనుకోలేదు..’: నాని

- Advertisement -
- Advertisement -

అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత హీరోగా ఎదిగి.. తనకంటూ ఓ గొప్ప ఫ్యాన్ బేస్ ఏర్పరుకున్నారు నేచురల్ స్టార్ నాని. అయితే ఆయన సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా.. ప్రొడ్యూసర్‌గా కూడా అవతారం ఎత్తారు. ‘వాల్‌పోస్టర్ సినిమా’ అనే బ్యానర్‌పై ఆయన పలు చిత్రాలను నిర్మించారు. తాజాగా ప్రియదర్శి హీరోగా.. నటించి ‘ది కోర్టు : స్టేట్ వర్సెస్ ఎ నోబడి’ అనే సినిమాను కూడా నాని నిర్మించారు. ఈ సినిమా మార్చి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తనకు జరిగిన ఓ అనుభవాన్ని నాని మీడియాతో పంచుకున్నారు. హీరో నాగచైతన్య పెళ్లిలో నాని కారు దిగి వస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి ఎదురుగా వచ్చారట. ఆయన నానిని చూసి ‘ప్రొడ్యూసర్ గారు బాగున్నారా?’ అని పలకరిస్తే.. తనను కాదు అని నాని అనుకున్నారట. అశ్వినీదత్ వంటి గొప్ప ప్రొడ్యూసర్లు వస్తున్నారేమో అని వెనక్కి చూస్తే ఎవరూ లేరని నాని చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి.. నానిని చూస్తూ ‘మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారు’ అని అని హగ్ ఇవ్వడంతో షాక్ అయ్యాను అని నాని పేర్కొన్నారు.

కాగా, ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. 2026లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News