Sunday, December 22, 2024

ఫన్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్ర్కైబ్’

- Advertisement -
- Advertisement -

హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్ర్కైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో దర్శకుడు మారుతి, నందినిరెడ్డి, సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, వెంకట్ బోయనపల్లి, మేర్లపాక గాంధీ పాల్గొన్నారు.

ఈ వేడుకలో నాని మాట్లాడుతూ… ‘గోల్కొండ హై స్కూల్ సినిమాలో సంతోష్ శోభన్ నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అతను చేస్తున్న లైక్ షేర్ & సబ్‌స్ర్కైబ్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఫారియా అబ్దుల్లా అద్భుతమైన నటి అని అన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ… ‘మేర్లపాక గాంధీతో మళ్ళీ మళ్ళీ పని చేయాలని వుంది. ‘ఎక్ మినీ కథ’లో అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ రోజు నేను ‘లైక్ షేర్ & సబ్‌స్ర్కైబ్’లో ఉన్నారు. నాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను’ అని తెలిపారు. చిత్ర దర్శకుడు గాంధీ మాట్లాడుతూ… లైక్ షేర్ & సబ్‌స్ర్కైబ్ సంతోష్ శోభన్ కోసమే పుట్టింది. సంతోష్ చాలా గొప్ప నటుడు అవుతాడు. ఈ సినిమా ఫన్ అండ్ ఎంటర్‌టైనింగా వుంటుంది’ అని చెప్పారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ… ‘మేర్లపాక గాంధీ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయన ఫన్ టైమింగ్ బావుంటుంది. సంతోష్‌ శోభన్‌తో కలసి నటించడం ఆనందంగా వుంది’ అని పేర్కొన్నారు.

Nani Speech at Like Share & Subscribe Pre Release

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News