Thursday, January 23, 2025

రవితేజ నాకు ఇన్‌స్పిరేషన్: నాని

- Advertisement -
- Advertisement -


మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్పీ, రవితేజ టీం వర్క్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల కానుంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. విజయవంతంగా జరిగిన వేడుకకు నేచురల్ స్టార్ నాని, స్టార్ దర్శకుడు బాబీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. రవితేజ, శరత్ మండవ, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ , వేణు తొట్టెంపూడి, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, అన్వేషి జైన్, సామ్ సిఎస్, సత్యన్ సూర్యన్, ప్రవీణ్, కళ్యాణ చక్రవర్తి తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ.. “రామారావు ఆన్ డ్యూటీ… నాకు చాలా డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ నాది. ఇంతకుముందు ఎప్పుడూ చేయనిది. దర్శకుడు శరత్ చాలా అద్భుతమైన సినిమా తీశాడు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌లు బ్యూటీఫుల్ గా వుంటారు. సీసా పాటలో అన్వేషి జైన్ అలరిస్తుంది. ఈ పాట చాలా బాగా వచ్చింది”అని అన్నారు. నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “మేము కెరీర్ మొదలుపెట్టినపుడు రవితేజ నాకు ఇన్‌స్పిరేషన్. రవితేజ మాటల్లో ఎంతో ప్రేమ వుంటుంది. సినిమా బావుంటే ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందిస్తారు. ’రామారావు ఆన్ డ్యూటీ’కి చాలా పాజిటివ్ వైబ్ వుంది. నా ’దసరా’ సినిమా చేస్తున్న నిర్మాతలే ఈ సినిమా చేస్తున్నారు”అని తెలిపారు. దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ “ఒక మంచి మనిషిగా రవితేజ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వల్లనే ’రామారావు ఆన్ డ్యూటీ’ సాధ్యమైంది. ట్రైలర్ ఎంత బావుందో అంతకంటే గొప్పగా సినిమా వుంటుంది” అని పేర్కొన్నారు.

Nani Speech at ‘Ramarao On Duty’ Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News