Monday, January 20, 2025

‘దసరా’ కాంబినేషన్ లో కొత్త మూవీ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

నాచురల్ స్టార్ నాని మరోకొత్త సినిమాను ప్రకటించారు. ‘దసరా’ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని సినిమా చేయబోతున్నారు. దసరా సందర్భంగా ముహూర్త షాట్‌కు హీరో నాని క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

కాగా, నాని, శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ అయని సంగతి తెలిసిందే. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక, అవార్డులు కూడా ఈ సినిమాకు క్యూ కట్టాయి. తాజాగా ప్రారంభమైన ఈ కొత్త చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News