Friday, December 20, 2024

#నానిఓదెల2 ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీలక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ (ఎస్‌ఎల్‌వి సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. #నానిఓదెల2 స్టన్నింగ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ దసరాకి 100 రెట్లు ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు నాని ఇటీవలే చెప్పారు. దసరా పలు అవార్డులను అందుకోవడం, హ్యుజ్ పాపులారిటీని సాధించడంతో, ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మేకర్స్ దసరా శుభ సందర్భంగా సినిమాని గ్రాండ్‌గా ప్రారంభించారు. శ్రీకాంత్ ఓదెల మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో నానిని చూపించే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే, లార్జర్ దెన్ లైఫ్ కథని రూపొందించారు. మోస్ట్ ఫెరోషియస్ పాత్ర కోసం నాని మేకోవర్‌కి సిద్ధంగా ఉన్నారు. పాషనేట్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ అండ్ డైనమిక్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నానికి మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ సినిమా కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News