Monday, December 23, 2024

గోవాలో నాని 30వ సినిమా

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వచ్చిన దసరా సినిమా బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతోంది. జనవరిలో నాని 30వ చిత్రం ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ‘సీతా రామం’ నటి మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ సోమవారం గోవాలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ షెడ్యూల్ 40 రోజుల పాటు కొనసాగుతుంది.

ఈ సినిమాలో నాని కూతురిగా బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. వైరా ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News