Monday, January 20, 2025

ఆకట్టుకుంటున్న ‘దసరా’ పోస్టర్..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన నాని, కీర్తిల ఫస్ట్ లుక్ పోస్టర్స్ సనీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు మేకర్స్. నాని, దీక్షిత్ శెట్టి క్రికెట్ బ్యాట్‌లు పట్టుకోగా, కీర్తి సురేష్ టెన్నిస్ బాల్ పట్టుకుని ఉన్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News