Monday, December 23, 2024

రెండు రోజుల్లో రూ. 53 కోట్లు వసూలు చేసిన ‘దసరా’

- Advertisement -
- Advertisement -

ముంబై: తొలి రెండు రోజుల్లోనే నాని నటించిన ‘దసరా’ రూ. 53 కోట్లకుపైగా వసూలు చేసింది. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఒదేల దీనికి దర్శకత్వం వహించారు. తెలంగాణ పెద్దపల్లి జిల్లా సింగరేణి బొగ్గు గని వద్ద ఉన్న గ్రామంలో ఈ సినిమా సెట్ ఉంటుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో తీశారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ దీనిని నిర్మించింది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోందని టాక్. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 38 కోట్లు, రెండో రోజు రూ. 15 కోట్లు… అంటే రెండు రోజుల్లో రూ. 53 కోట్లు వసూలు చేసిందని పత్రికా ప్రకటన పేర్కొంది. ‘దసరా’ సినిమాలో కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముతిరకణి, సాయి కుమార్, పూర్ణ నటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News