Tuesday, April 15, 2025

నాని ‘హిట్-3’ ట్రైలర్ వచ్చేసింది.. నరుకుడే నరుకుడు…

- Advertisement -
- Advertisement -

నాచురల్ స్టార్ నాని, శైలేశ్‌ కొలను కాంబో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయిక నటిస్తోంది. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. గత రెండు సినిమాల కంటే ఇందులో రక్తపాతం ఎక్కువగా ఉన్నట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. ఇందులో నాని పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో అర్జున్‌ సర్కార్‌గా కనిపించనున్నారు. ఆయన చెప్పే డైలాగ్స్ తోపాటు యాక్షన్ సీన్స్ ఆకట్టుకునే ఉన్నాయి. కాగా, ఈ సినిమాను కానుకగా మే 1న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ లో మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News