- Advertisement -
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిశారు. మొదటి సినిమా ‘అంటే సుందరానికీ’ హోల్సమ్ ఎంటర్‌టైనర్ అయితే, రెండో సినిమా ‘సరిపోదా శనివారం’ యూనిక్ యాక్షనర్. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ‘సరిపోదా శనివారం’ దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
నిర్మాత డివివి దానయ్య దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తం సన్నివేశానికి దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, వివి వినాయక్ క్లాప్ ఇచ్చారు. తొలి షాట్‌కి ఎస్‌జె సూర్య గౌరవ దర్శకత్వం వహించారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
- Advertisement -