Thursday, January 23, 2025

రైతులకు అందుబాటులో నానో డిఏపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధునాతన సాంకేతికత పెరుగుతున్న కొలది వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఈ దిశగా ఇప్పుడు నానో డిఏపి రైతులకు అందుబాటులోకి వచ్చిందని కేంద్ర రసాయనాలు పెట్రోకెమికల్స్ , ఎరువుల మత్రిత్వశాఖ కార్యదర్శి అరుణ్ బరోక అన్నారు. శనివారం ఇక్కడి కోరమాండల్ కంపెనీ యూనిట్‌లో నానో డిఏపిని ఆవిష్కరించారు. ప్రగతి శీల రైతులకు నానో డిఏపి సాంపిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అరుణ్ బరోక మాట్లాడుతూ ఎరువుల రంగంలో ఆత్మనిర్బర్ లక్ష్యాలను సాధించే దిశగా దేశం ముందుకు సాగడంలో నానో డిఏపి ఒక ముఖ్యమైన అడుగు అని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం నానో ఎరువుల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. సంప్రదాయ పోషకాలకు ప్రత్యామ్నాయంగా నానో ఎరువులను తీసుకువచ్చినట్టు తెలిపారు. దీని వినియోగం నేలకు అవసరమైన నిర్దుష్ట పోషకాలకు అందించడం ,వృధాను తగ్గించడం , నీటిని సంరక్షించడం అని వెల్లడించారు. కోరమాండల్ కం పెనీ వైస్ చైర్మన్ అరున్‌ఖ అలగప్ప మాట్లాడుతూ నానో డిఏపి ఎరువు పంటలకు నత్రజని, భాస్వరం సమృద్దిగా అందజేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News