అమరావతి: రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు నాయుడుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును మంగళవారం ఆయన నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణిలు కలిశారు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. “చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించేవారు. ఆయనతో మాట్లాడి వస్తుంటే నాలో ఒక భాగం అక్కడే వదిలేసి వచ్చినట్టుంది. ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడూ అనేవారు. ప్రజల హక్కుల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. జైలులోనూ చంద్రబాబు ప్రజల గురించే ఆలోచిసస్తున్నారు. చంద్రబాబు భద్రత గురించి నాకు భయం ఉంది. జైలు నుంచి త్వరగా బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తా అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎటూ వెళ్లదు. ప్రజలు, క్యాడర్ కోసం టిడిపి పోరాడుతోంది. మా కుటుంబం తరపున నేను హామి ఇస్తున్నా. తప్పుడు కేసులో ఆయన కట్టించిన జైలు భవనంలోనే ఆయన్ను కట్టిపడేశారు. ఏమీలేని కేసులో చంద్రబాబును వేధిస్తున్నారు. ప్రజలు దీనిపై ఆలోచించాలి” అని పేర్కొన్నారు.
ప్రజల హక్కుల కోసమే చంద్రబాబు పోరాటం: భువనేశ్వరి
- Advertisement -
- Advertisement -
- Advertisement -