Monday, December 23, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్:  టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భువనేశ్వరితో పాటు టిడిపి ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన స్థానికులు, తెదేపా కార్యకర్తలను పోలీసులు ఆలయానికి దూరంగా పంపించారు.

శ్రీవారి దర్శనం అనంతరం భువనేశ్వరి నారావారిపల్లెకు వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు. 25న చంద్రగిరిలో ఈ యాత్రను ఆమె ప్రారంభిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News