Sunday, December 22, 2024

వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి విమర్శలు

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నంను గంజాయి రాజధానిగా మార్చిందని నారా భువనేశ్వరి విమర్శించారు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాం అని చెప్పి ఇన్నేళ్లయినా ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదేంటా అని మనం అనుకున్నాం కానీ… విశాఖని గంజాయి కాపిటల్ గా ఎప్పుడో మార్చేశారు. మనకే అర్థం కాలేదు. లక్షల కోట్ల విలువ జేసే డ్రగ్స్ సమాజంలోకి వస్తే మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండన్నారు. దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుతో జూదం ఆడుతున్నారని భువనేశ్వరి ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నారా భువనేశ్వరి ట్విట్టర్‌లో ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News