Monday, December 23, 2024

తల్లి వర్థంతి కార్యక్రమాలకు వెళ్లనివ్వరా: భువనేశ్వరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భందం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వ వైఖరి తనని ఎంతో బాధించిందని, తల్లి వర్థంతి కార్యక్రమాలకు కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదేమి చట్టం… ఇదెక్కడి న్యాయం అని అడిగారు. వ్యవస్థల నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఎందుకు ఆందోళన చెందేవారో అని, ఇప్పుడు అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని ఉన్నతాధికారులను కోరుతున్నానని, వ్యక్తిగత హక్కులు, సంప్రదాయాలకు రాజకీయాలతో ముడిపెట్టొద్దని కోరుతున్నానని భువనేశ్వరి విన్నవించారు.

Also Read: ఛాంపియన్‌కు వరుస షాక్‌లు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News