Friday, November 22, 2024

తనలా మరెవ్వరికీ అవమానం జరగొద్దు!

- Advertisement -
- Advertisement -
Nara Bhuvaneswari Reacts on Assembly incident
నారా భువనేశ్వరి

హైదరాబాద్ : తనకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకూడదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. ఇటీవల అమరావతి శాసనసభలో జరిగిన ఘటనపై శుక్రవారం ఆమె తొలిసారిగా స్పందించారు. తనపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన వారందరికి పేరుపేరున ధనవ్యాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకి, కూతురికి జరిగినట్లు భావించి.. అండగా నిలబడటం జీవితంలో మర్చిపోలేనని వ్యాఖ్యానించారు. చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు ఎంతో విలువలు, క్రమ శిక్షణతో పెంచారన్నారు. వాటికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామాన్నారు. తానే కాదు…మొత్తం ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులు కూడా నేటికీ మేం వాటిని పాటిస్తున్నామని భువనేశ్వరి అన్నారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంతేతప్ప మహిళలను కించపరిచే విధంగా చట్టసభల్లో మాట్లాడడం సముచితంగా లేదన్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలన్నారు. అనవసరంగా ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News