Wednesday, April 2, 2025

తెలంగాణకు పరిశ్రమలు తరలిపోవడంపై జగన్ సర్కార్‌పై బ్రాహ్మణి ఫైర్

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పరిశ్రమలు ఎందుకు తరలివెళ్లిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

శుక్రవారం ఎక్స్(పూర్వ ట్విట్టర్) వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. ఇతర రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు పనిచేస్తోందని ఆమె నిలదీశారు. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌వన్‌గా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రజలు గర్వపడేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారని ఆమె పేర్కొన్నారు.

అమరరాజా, నుంచి లులూ వరకు పరిశ్రమలు వెళ్లిపోయాయని, తెలంగాణకు పెట్టుబడిదారులు వెళ్లిపోవడానికి దారితీసిన పరిస్థిలులు ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రపదేశ్ నుంచి తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు వెళ్లిపోవడంపై ది ప్రింట్ పత్రిక ప్రచురించిన కథనాన్ని బ్రాహ్మణి తన పోస్టుకు జతచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News