Thursday, January 23, 2025

బెంజ్ మంత్రి మీ ఆవు కథలు ఆపాలి: నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: బెంజ్ మంత్రి జయరామ్ బిపి, బూతులు ఎందుకు అని టిడిపి యువనేత నారా లోకేశ్ ప్రశ్నించారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. అడిగిన దానికి తప్ప మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ నోరు పారేసుకోవడం ఎందుకు అని అడిగారు. ఇఎస్‌ఐ స్కామ్ తరువాత మంత్రి బెంజ్ కారును గిఫ్ట్‌గా తీసుకున్నారని చురకలంటించారు. అదే కారులో మంత్రి కుమారుడు షికార్లు కొట్టడం అందరికి తెలుసునన్నారు. ఇప్పుడు స్కామ్‌పై చర్చకు సవాల్ చెయ్యడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బెంజ్ మంత్రి మీ ఆవు కథలు ఆపాలని, తన సవాల్‌కు తాను కట్టుబడి ఉన్నానని లోకేష్ తెలిపారు. ఒక్క వాల్మీకి కుటుంబం అయినా ఎకరం భూమి కొనే స్థితిలో ఉందా? అని ప్రశ్నించారు. మీరు వందల ఎకరాలకు ఎలా అధిపతి అయ్యారని నిలదీశారు.

Also Read: 180 ఎకరాల భూములను కొట్టేసిన మంత్రి జయరామ్: లోకేష్

77 రోజుల్లో 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగింది. ప్రతి వంద కిలో మీటర్లకు ఆ ప్రాంతానికి లోకేష్ ఒక్కో హామీ ఇచ్చాడు. శుక్రవారం వెయ్యి కిలో మీటర్ల సందర్భంగా ఆదోని టౌన్ వార్డు 21ని దత్తత తీసుకోవాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు సగటున 13 కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రపై పదుల సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News