- Advertisement -
అమరావతి: కర్నూలు జిలా చెట్నిహళ్లి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని టిడిపి యువనేత నారా లోకేశ్ తెలిపారు. యువగళం పాదయాత్ర 82వ రోజుకు చేరుకుంది. మంత్రాలయం నియోజకవర్గంలో లోకేశ్ పాదాయత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. వైపిసి పాలనలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని మండిపడ్డారు. రూ.3500 కోట్లతో ఏర్పాటు చేస్తామన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. టిడిపి హయాంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిచ్చామని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి తారునీరు అందిస్తామన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరకు రైతుల సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తున్నామన్నారు.
Also Read: సిఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ
- Advertisement -