Monday, December 23, 2024

లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  హైకోర్టులో నారా లోకేష్ కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పిటిషన్ వేశారు. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో కూడా హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. సిఐడి నోటీసులపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 41ఎ సిఆర్‌పిసిలో సిఐడి అధికారులు హెరిటేజ్ బోర్డు మీటింగ్ మినిట్స్‌ను అడిగారు. హెరిటేజ్ భూముల విక్రయాల లావాదేవీలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నారాయణ నాలుగు పిటిషన్లు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో నారాయణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది. అసైన్డ్ భూముల కుంభకోణంలో బెయిల్, క్వాష్ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News