Sunday, December 22, 2024

ఐఆర్‌ఆర్ కేసు.. ఎపి హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐఆర్‌ఆర్ (అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు) కేసులో మాజీ సిఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను ఏపీ-సిఐడి 14వ నిందితుడిగా చేర్చింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం లోకేష్ ఎపి హైకోర్టును ఆశ్రయించారు. లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నందున ఆయన తరఫున్ న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాజధానిలోని అన్ని రహదారులను కలుపుతూ అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ ఆర్ ) ప్రాజెక్టును గత టిడిపి ప్రభుత్వం చేప్ట్టింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. వైసిపి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఎసి సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా గత ఏడాది ఏప్రిల్‌లో ఐపిసి, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సిఐడి కేసు నమోదు చేసింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా సిఐడి గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏ-1గా, నారాయణను ఏ-2గా పేర్కొన్న సీఐడీ, నారా లోకేష్ ను ఏ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌లో చేసిన మార్పుల ద్వారా లోకేష్ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనీ, అలైన్ మెంట్ ప్రక్రియ ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కు భూసేకరణకు సంబంధించిన అవకతవకలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్‌లను నిందితులుగా ఎపి సిఐడి చేర్చింది. అయితే ఈ కేసులో నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News