Friday, December 20, 2024

నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న ఉదయం 11.03 నిమిషాలకు తొలి అడుగు వేయనున్నారు. రేపులో హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ ఘాట్‌లో నారా లోకేష్ నివాళులర్పించనున్నారు. రేపు కడపలో దర్గా, చర్చ్‌కు లోకేష్ వెళ్లనున్నారు. ఎల్లుండి తిరుమల శ్రీవారిని లోకేష్ దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కుప్పానికి నారా లోకేష్ చేరుకోనున్నారు. 26న మధ్యాహ్నానికి లోకేష్ కుప్పం చేరుకోనున్నారు. టిడిపి శ్రేణులు ఇప్పటికే కుప్పం చేరుకుంటున్నాయి. 27న పాదయాత్ర అనంతరం కుప్పంలో బహిరంగ సభ ఉంది. కుప్పం సభకు తెలుగు తమ్ముళ్లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు లోకేష్ పాదయాత్రం జరిగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News