Saturday, January 18, 2025

ఎన్టీఆర్ అంటే ప్రభంజనం: మంత్రి లోకేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్టీఆర్ అంటే పేరు కాదు.. ప్రభంజనం అని మంత్రి లోకేష్ తెలిపారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని ఎన్టీఆర్ కొరుకునే వారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29 వర్ధంతి  సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద  తల్లి భువనేశ్వరితో కలిసి నారా లోకేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారని, ఎన్టీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారనిన్నారు. టిడిపిలో కోటిమంది  సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమని లోకేష్ పేర్కొన్నారు.

విశాఖను ఉక్కు నగరంగా కాపాడుకుంటున్నామని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పునర్ నిర్మాణంపై చర్చిస్తున్నామని,  టిడిపిపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉందని,  తెలంగాణలో లక్షా 60 వేల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని లోకేష్ తెలియజేశారు. తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పని చేస్తామని, ఎన్టీఆర్ కు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News