Wednesday, January 22, 2025

రైతులతో కలిసి దుక్కిదున్నిన నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో రైతులు, యువత, సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో యువ గళం పాదయాత్రలో నారా లోకేష్ రైతుగా మారి స్థానికులతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

నారా లోకేష్ తన 75వ రోజు పాదయాత్రలో భాగంగా ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో నాగలి పట్టుకుని రైతులతో కలిసి దుక్కిదున్నారు. టీడీపీ యూత్ నాయకుడి ప్రయత్నాలను స్థానికులు అభినందించారు. 400 రోజుల పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ చేపట్టిన నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంలో ముగియనుంది. నారా లోకేష్ తన పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో, ముఖ్యంగా రైతులు, యువతతో కనెక్ట్ అవ్వడం వారి అవసరాలు, ఆందోళనలపై అవగాహన పొందడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News