Friday, December 20, 2024

నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నారావారి పల్లెలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఏపి మంత్రి లోకేశ్, రామ్మూర్తి నాయుడు తనయుడు, సినీ నటుడు రోహిత్, ఇతర కుటుంబ సభ్యులు ఈ అంత్యక్రియలో పాల్గొన్నారు. తన తల్లిందండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ నారా రామ్మూర్తి నాయుడు కన్ను మూసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు చాలా మంది ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News