అమరావతి: ఎపి అసెంబ్లీలో జరిగిన ఘటనపై సినీనటుడు నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారావారిపల్లెలో నిరసనకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా వైసిపి నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన వ్యక్తిగత విమర్శల దాడిని ఖండిస్తూ తమ పూర్వీకుల(చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు) సమాధుల వద్ద ఆదివారం ఉదయం నివాళులర్పించిన నారా రోహిత్ అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. ”ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. క్రమశిక్షణకు మారుపేరుగా, సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. అటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆమెపై ఇలాంటి నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్థం కావడంలేదు” అని నారా రోహిత్ తీవ్రంగా మండిపడ్డారు.
Nara Rohit Protest against YCP Leaders Comments