Friday, December 20, 2024

రామ్మూర్తి నాయుడుపై రోహిత్ భావోద్వేగ పోస్ట్!

- Advertisement -
- Advertisement -

నటుడు నారా రోహిత్ తన తండ్రి రామ్మూర్తి నాయుడిపై ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.  ‘ మీరు ఒక ఫైటర్ నాన్నా. ప్రేమించడం, యోధుడిలా బతకడాన్ని మీరు నాకు నేర్పించారు. మీ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ప్రజలను ప్రేమించడం, మంచి కోసం పోరాడటం మీరు నేర్పించారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నప్పటికీ… మాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాన్నా… జీవితాంతం మరిచిపోలేని మీ జ్ఞాపకాలు నాకు ఎన్నో ఉన్నాయి. ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. బై నాన్నా’ అంటూ ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News