Friday, December 20, 2024

మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్‌తో…

- Advertisement -
- Advertisement -

హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ కొన్ని రోజుల క్రితం ఆసక్తిని రేకెత్తించే ప్రీ లుక్ పోస్టర్‌తో ప్రకటించారు. సోమవారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రతినిధి 2 అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.

దీంతో ఇది ‘ప్రతినిధి’ సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ కానుంది. ఫస్ట్-లుక్ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్‌తో అందరినీ ఆకట్టుకుంది. పోస్టర్‌లో చూపిన విధంగా ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News