Sunday, December 22, 2024

కాఫీ ఎస్టేట్ నేపథ్యంగా సాగే సినిమా

- Advertisement -
- Advertisement -

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘నరకాసుర‘. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌లో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న ‘నరకాసుర‘ సినిమా ఉషా పిక్చర్స్ ద్వారా థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ సెబాస్టియన్ మాట్లాడుతూ “రెండు వేలకు పైగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అందుకున్న ఉషా పిక్చర్స్ ద్వారా మా సినిమాను నవంబర్ 3న గ్రాండ్‌గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ‘నరకాసుర‘ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. పోస్టర్, టీజర్‌లో చూసిందే కాదు సినిమాలో ఆశ్చర్యపరిచే అంశాలుంటాయి”అని అన్నారు.

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ “నరకాసుర… మేమందరం గర్వపడే సినిమా అవుతుందని చెప్పగలను. కాఫీ ఎస్టేట్ నేపథ్యంగా సాగే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అపర్ణ, నిర్మాత డాక్టర్ అజ్జ శ్రీనివాస్, ఉషా పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News