Monday, December 23, 2024

ఒక టికెట్‌పై ఇద్దరికి సినిమా చూసే అవకాశం

- Advertisement -
- Advertisement -

రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోయిన్స్‌గా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘నరకాసుర’ సినిమా. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. ‘నరకాసుర’ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్‌లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ‘నరకాసుర‘ మూవీ టీమ్ సభ్యులు. సోమవారం నుంచి ఈ సినిమాను థియేటర్స్‌లో ఒక టికెట్‌పై ఇద్దరు ప్రేక్షకులు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ ‘నరకాసుర’ సినిమాకు థియేటర్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రక్షిత్ బాగా నటించాడు, ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి ప్రశంసలతో పాటు మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మా సినిమాలో సందేశం మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని మండే నుంచి గురువారం వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం. ‘నరకాసుర’ వంటి మంచి సినిమాను థియేటర్స్‌లోనే చూడండని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ.. మా ‘నరకాసుర‘ సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాం. సినిమా చూసిన వాళ్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మీడియా రివ్యూస్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. కొందరు పర్సనల్‌గా నాకు సినిమా ఆకట్టుకుందని మెసేజ్‌లు పంపుతున్నారు. సినిమా బాగుందని చెప్పడమే కాదు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టర్స్ పర్ ఫార్మెన్స్, ఫైట్స్..ఇలా ప్రతి క్రాఫ్ట్ వర్క్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. ట్రాన్స్ జెండర్స్‌ను చిన్న చూపు చూడకూడదు మనుషులంతా ఒక్కటే అని మేము ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు రీచ్ అవుతోంది’ అని అన్నారు.

నిర్మాత డాక్టర్ అజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నరకాసుర’ మూవీతో మా బ్యానర్ సుముఖ క్రియేషన్స్‌కు మంచి పేరొచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా మంచి మూవీ చేశారంటూ ప్రశంసిస్తున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయని అంటున్నారు. విదేశాల నుంచి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. రక్షిత్‌తో పాటు హీరోయిన్స్, ఇతర నటీనటుల నటన ఆకట్టుకుందని అభినందిస్తున్నాను. ‘నరకాసుర’ చూడని వాళ్లు థియేటర్స్‌కు వెళ్లండి. ఈ సినిమాలోని మంచి మెసేజ్ ను ఇతరులకు చెప్పండి. మా సంస్థలో గుర్తుండిపోయే సినిమా చేసిన డైరెక్టర్ సెబాస్టియన్ గారికి థ్యాంక్స్’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News