Wednesday, January 22, 2025

‘నరకాసుర’ టీజర్ కు భారీ రెస్పాన్స్..

- Advertisement -
- Advertisement -

పలాస ఫేమ్ రక్షిత్ హీరోగా నటించిన చిత్రం ‘నరకాసుర’. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా శనివారం విడుదల చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీపై టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమాలో సంగీర్తన, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా జరుగుతున్నప్పు ఇంత గొప్ప అవుట్ ఫుట్ వస్తుందని నేను ఎప్పుడు నమ్మలేదు. దీని కోసం ఏంటో బాధను భరించాము. త్యాగాలు చేసాం. బట్ ఈ రియాక్షన్ చూసాక అంటా మర్చిపోయాను. నేను జబల్ పూర్ లో సెటిల్ అయ్యాను స్క్రిప్ట్ కూడా అక్కడే రాసుకున్నాను. అక్కడే కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ చేసాం. నేను స్క్రిప్ట్ రాసుకున్నదంతా తీసే ప్రయత్నం చేశాను. మాక్సిమం నేను అనుకున్న ఫలితం వచ్చింది. ఈ జర్నీ మొత్తంలో ఆర్టిస్టుల సపోర్ట్ మరువలేను. హీరో రక్షిత్ సపోర్ట్ గురించి ఎంత చెప్పిన తక్కువే. చాల టఫ్ గా ఉన్నా వాతావరణంలో పని చేసాడు. స్క్రిప్ట్ కు తగ్గట్టుగా రకరకాలుగా కనిపించేందు రెండున్నరేళ్ల పాటు ఎంతో కష్టపడ్డాడు. ఖచ్చింతంగా ఈ మూవీతో సక్సెస్ అందుకుంటాం. ఈ సందర్బంగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ మరోసకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను” అన్నారు.

IPL 2023: CSK Set 201 Runs Target for PBKS

Also Read: రెండో రోజు ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వసూళ్లు రూ. 100 కోట్లు దాటింది!

హీరో రక్షిత్ మాట్లాడుతూ .. ”ఒక టీజర్ ఇంపాక్ట్ ఏంటో పలాస టైంలో చూసాను. ఆ మూవీ తర్వాత గాప్  రావడంతో అందరూ హేళనగా మాట్లాడారు. బట్ ఈ టీజర్ వారికీ సమధానం చెబుతుంది. ఈ మూవీ కోసం రెండేళ్ల పాటు హీరోయిన్స్ కూడా కష్టపడ్డారు. ఇంతమంది సీనియర్ యాక్టర్స్ తో పని చేసే అవకాశం కల్పించిన దర్శకుడికి థాంక్స్ చెబుతున్నాను. మా డీవోపీ నాని అద్భుతంగా చూపించారు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. త్వరలోనే మరో పాటతో రాబోతున్నాం” అన్నారు. కాగ, తెలుగులతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News