Monday, December 23, 2024

నా చావుకు సిఐ, కానిస్టేబులే కారణం

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఐ, కానిస్టేబుల్ వేధించడంతో ఓ యువకుడు రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…  మస్తాన్ బాయ్ అనే వ్యక్తి 12 వాహనాల తాకట్టులో పోలీసులకు చిక్కాడు. వాటిలో దొంగతనం చేసిన వాహనాలు ఉండడంతో మస్తాన్ కొట్టించి తన పేరు చెప్పించాలని పోలీసులు చూస్తున్నారని యువకుడు ఆరోపణలు చేశాడు. తనకు కానిస్టేబుల్ ఫోన్ చేసి తనపై కేసులు పెడుతామని బెదిరిస్తున్నాడని బాధితుడు వాపోయాడు.

ఐదు లక్షల రూపాయలు ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తామని కానిస్టేబుల్ బాబు బెదిరించాడని ఆరోపణలు చేశాడు. సిఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడని బాధితుడు మదార్ వలి వాపోయాడు. కానిస్టేబుల్ చేసిన ఫోన్ కాల్ రికార్డు కూడా తన దగ్గర ఉందని అతడు తెలియజేశాడు. వాహనాలతో కేసుకు తనకు సంబంధంలేదని, అంత డబ్బు తన వద్ద లేదని ఇక తనకి చావే శరణ్యం అని రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతున్నానని మదార్ వలి వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్‌పి, సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ చేరాలని విజ్ఞప్తి చేశాడు. తన చావుకు సిఐ పసుపులేటి రామకృష్ణ, కానిస్టేబుల్ కారణమని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News