Thursday, January 23, 2025

దిశా సాలియన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లను చంపేశారు

- Advertisement -
- Advertisement -
Narayan Rane On Disha Salian And Sushant Murder case
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఆరోపణ …
సిబిఐకి వివరాలు ఇవ్వడానికి సిద్ధం

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మేనేజర్ దిశా సాలియన్ హత్యకావింపబడ్డారని, ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉందని కేంద్ర ఎంఎస్‌ఎంఇ మంత్రి నారాయణ్ రాణే ఆరోపించారు. సిబిఐ తనను అడిగితే దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి చెప్పారు. ఈ హత్యలపై దర్యాప్తు ఎప్పుడైనా బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. 2020 జూన్ 89 అర్థరాత్రి ముంబై మలాడ్ ప్రాంతం గెలాక్సీ రీజెంట్ భవనం 14 వ అంతస్తు నుంచి 28 ఏళ్ల దిశా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం సుశాంత్ మృతదేహం బయటపడడానికి ఐదు రోజుల ముందే జరిగింది.

2020 జూన్ 14న బాంద్రా లోని సుశాంత్ అద్దెకు ఉంటున్న డూప్లెక్సు ఫ్లాట్ లో సుశాంత్ మృతదేహం బయటపడింది. దిశా సాలియన్ జూన్ 8 న అత్యాచారానికి , తరువాత హత్యకు బలైంది. దీనిగురించి నటుడు సుశాంత్ సింగ్‌కు తెలుసు. నేను వారిని విడిచిపెట్టేది లేదని ఆ నటుడు చెప్పేవాడు. కానీ నిందితులు జూన్ 13 రాత్రి సుశాంత్ సింగ్‌ను ఉరికి వేలాడదీశారని మంత్రి ఆరోపించారు. దిశా సాలియన్ పోస్ట్‌మార్టమ్ రిపోర్టు వెల్లడి కాలేదు. కానీ ఆ వివరాలన్నీ నాకు తెలుసని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వం మారితే డాక్టర్లు ఆ వివరాలు బయటపెడతారని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించి సిసిటివి ఫుటేజి లోని అనేక భాగాలు గల్లంతయ్యాయి. దిశాకు కాబోయే భర్త రోహన్ రాయ్ ఎక్కడ ? అని రాణే ప్రశ్నించారు. అలాగే సుశాంత్ ఇంట్లో పనిచేసే సావంత్ ఎక్కడ ? అని మంత్రి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News