Thursday, January 23, 2025

కూనంనేనికి నారాయణ, చాడ అభినందనలు 

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎంఎల్‌ఏగా భారీ మెజారిటీ తో గెలుపొందిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు హైదరాబాద్, హిమాయత్ నగర్, సిపిఐ రాష్ట్ర కార్యాలయం, మఖ్డూమ్ భవన్‌లో సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, ప్రజాపక్షం సంపాదకులు కె. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికి… శాలువా, పుషాగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా డా.కె.నారాయణ మాట్లాడుతూ సిపిఐ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అభినందనలు తెలిపారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న సిపిఐ, కాంగ్రెస్ అభ్యర్థులను ఎంఎల్‌ఏలుగా గెలిపించిన రాష్ట్ర ప్రజలకు అయన కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డా.కె.నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సిపిఐ కార్యాలయ కార్యదర్శి ఎ.గోవింద్ రావు, సిబ్బంది దశరథ్, శ్రీరాములు, రాజ్ కుమార్, సురేందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News