Thursday, January 23, 2025

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం

- Advertisement -
- Advertisement -

చిన్నా పాపిశెట్టి దర్శకత్వం లో యంగ్ హీరో సుధాకర్ కోమాకుల నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, తిరువీర్, రాజ్ కందుకూరి, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ “సినిమా కంటెంట్ చాలా బావుంది. ‘నారాయణ అండ్ కో’తో సుధాకర్‌కు మంచి బ్రేక్ వస్తుందని భావిస్తున్నాను”అని తెలిపారు. హీరో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ “చాలా మంచి ఫన్ ఎంటర్‌టైనర్ ఇది. ‘నారాయణ అండ్ కో’ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా” అని అన్నారు. దర్శక, నిర్మాత చిన్నా మాట్లాడుతూ ఇది ఫ్యామిలీ ఫండెడ్ మూవీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమని, దేవి ప్రసాద్, పూజా కిరణ్, ఆర్తి పొడి, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News