- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణ పిటిషన్‌పై ఎపి హైకోర్టులో విచారణ జరుగుతోంది. నారాయణ క్యాష్ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని జడ్జి తెలిపారు. నారాయణ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు. నారాయణ క్వాష్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. మరో వైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఎసిబి కోర్టులో విచారణ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తరపు లాయర్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తున్నారు. దూబే వాదనలను నోట్ చేసుకోవాలని సిఐడి తరపు న్యాయవాదులకు ఎసిబి కోర్టు సూచించింది.
- Advertisement -