Sunday, December 22, 2024

మనవడికి రూ.240 కోట్ల విలువైన గిఫ్ట్

- Advertisement -
- Advertisement -

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి తన మనవడు ఏకాగ్రహ్‌కు ఖరీదైన బహుమతి ఇచ్చాడు. దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌లో 0.04 శాతం వాటా(రూ.240 కోట్లు)ను తన మనవడికి మూర్తి గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఇన్ఫోసిస్‌లో మూర్తి వాటా 0.36 శాతానికి తగ్గింది. నారాయణ మూర్తి కొడుకు రోహన్ మూర్తి, అయితే రోహన్ కుమారుడు అయిన ఎకాగ్రాహ్ వయసు 4 నెలలు మాత్రమే. నారాయణ మూర్తి ఏకాగ్రహ్‌కు రూ.240 కోట్ల విలువైన షేర్లను ఇచ్చినట్లు ఇన్ఫోసిస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్‌లో వెల్లడించారు. ఈ బదిలీ తర్వాత దేశంలోని రెండో అతిపెద్ద టెక్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌లోని 15 లక్షల షేర్లను ఎకాగ్రాహ్ కలిగి ఉంటాడు.

మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం, ఇప్పుడు ఈ ఆఫ్-మార్కెట్ బదిలీ తర్వాత నారాయణ మూర్తికి దాదాపు 1.51 కోట్ల షేర్లు మిగిలి ఉన్నాయి, అంటే దాదాపు 0.36 శాతం వాటా ఉంది. రోహన్ మూర్తి, అపర్ణ కృష్ణన్ 2023 నవంబర్‌లో తల్లిదండ్రులు అయ్యారు. ఏకాగ్రహ్ జననంతో నారాయణమూర్తి, సుధా మూర్తి తాతయ్యలు అయ్యారు. ఆయన కుమార్తె అక్షతా మూర్తి బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News