బాచుపల్లి : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. కామరెడ్డికి చెందిన రాగుల వంశిత (16) అనే విద్యార్థినిని తల్లిదండ్రులు వారం క్రితం నారాయణ కలశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిసిలో జాయిన్ చేశారు. నేడు ఉదయం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో కింద పడి మృతి చెందింది.
దీంతో హుటాహుటిన కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీస్తున్నారు. వంశిత బిల్డింగ్ పై నుండి దూకిందా ? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని వంశితది ఆత్మహత్యనా.. లేక హత్యనా.. అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సివుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.