Monday, December 23, 2024

బాలీవుడ్ నటుడు సుశాంత్ డ్రగ్స్ కేసు… స్నేహితురాలు రియాపై ఎన్‌సిబి అభియోగాలు

- Advertisement -
- Advertisement -

Narcotics Control Bureau (NCB) latest charges against Riya Chakraborty

 

ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. నటి, సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి పై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) తాజాగా అభియోగాలు మోపింది. సుశాంత్ కోసం ఆమె నిషేధిత పదార్ధాలను కొనుగోలు చేసిందని, అతడి మాదక ద్రవ్యాల వ్యసనాన్ని ప్రోత్సహించిందని వాటిలో పేర్కొంది. తాజా అభియోగాల్లో ఆమెతో సహా మరో 34 మంది పేర్లను చేర్చింది. వారిలో రియా సోదరుడు షోవిక్ పేరు కూడా ఉంది. 2020 జూన్ 14న ముంబైలో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతడి మరణం తర్వాత బాలీవుడ్ టెలివిజన్ రంగంలో డ్రగ్స్ వినియోగంపై ఎన్‌సీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అనేక కీలక విషయాలు వెలుగు లోకి వచ్చాయి. దానిలో భాగంగా నెలరోజుల పాటు రియా జైలుకెళ్లాల్సి వచ్చింది. నెల తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. ప్రస్తుత అభియోగాల్లో రియా, సుశాంత్ కోసం కొద్ది మొత్తంలో గంజాయి సేకరించిందని, అందుకోసం కొంత డబ్బు చెల్లించిందని వెల్లడించింది. ఈ కేసులో గనుక ఆమె దోషిగా తేలితే 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News