హైదరాబాద్: మస్తాన్సాయి కేసులో నార్కోటిక్ పోలీసులు రంగంలోకి దిగారు. విచ్చలవిడిగా డ్రగ్స్ వీడియోలు వైరల్ కావడంతో నార్కోటిక్ అధికారులు విచారణ ప్రారంభించారు. మస్తాన్సాయి హార్డ్డిస్క్లో భారీగా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డాయి. డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను నార్కోటిక్ పోలీసులు సేకరిస్తున్నారు. గతంలోనూ మస్తాన్సాయి, లావణ్యపై డ్రగ్స్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరితో పాటు పార్టీల్లో పాల్గొన్న వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకవస్తున్నారు, ఎక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారు?.. ఎంతమంది డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. మస్తాన్సాయిని 4 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని కోర్టును నార్సింగి పోలీసులు కోరిన విషయం తెలిసిందే. మస్తాన్సాయి కస్టడీ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. మస్తాన్‌సాయిపై లావణ్య ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసిన విషయం విధితమే.
సినీ నటులు రా జ్‌తరుణ్, లావణ్య కేసులో ఇద్దరు నిందితులు రావి బావాజీ మ స్తాన్ సాయి, షేక్ ఖాన్ మోహిద్దిన్ ను నార్సింగి పోలీసులు జనవరి 31న అరెస్టు చేశారు. మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేయడంతోనే తాను రాజ్ తరుణ్ తో విడిపోయానని ఫిర్యాదులో లావణ్య పేర్కొంది. గత ఏడాది నవంబర్‌లో మస్తాన్ సాయి ఇంటికి వెళ్లిన లావణ్య అతడి ఇంట్లోని 4టిబి ఉన్న హార్డ్ డిస్క్‌ను తీసుకుంది. హార్డ్ డిస్క్ యువతుల వీడియోలతో పాటు డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డాయి. మస్తాన్ సాయి ఫోన్‌లో 800మంది యువతుల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువతుల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.