Wednesday, January 22, 2025

సాయిధరమ్ తేజ్ కు షాక్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో షాకిచ్చింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం గాంజా శంకర్ టైటిల్ పై నార్కోటిక్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ టైటిల్ ను మార్చాలంటూ చిత్ర యూనిట్ కు నోటీసులు ఇచ్చారు. ఆ మూవీ టీజర్ కూడా విద్యార్థులు, యువతపై ప్రభావం చూపేలా ఉందని ఆగ్రహం వ్యక్త చేస్తూ.. సినిమాలో గంజాయి, డ్రగ్స్ ప్రోత్సహించేలా సీన్స్ ఉంటే తొలగించాలని ఆదేశించారు. సినిమాలో గంజాయికి సంబంధించిన సన్నివేశాలు ఉంటే చట్టం పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు.

సినిమా నటులు సమాజం పట్ల బాధ్యతో నడుచుకోవాలని.. వారు చేసే పనుల ప్రభావం జనాలపై పడుతుందని.. సినిమాల్లో మాదిరిగా యువత అనుసరించే ప్రమాదం ఉంటుందని నార్కోటిక్ పోలీసులు తెలిపారు.

కాగా, గాంజా శంకర్ మూవీ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మాదక ద్రవ్యాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News