Wednesday, January 22, 2025

రోజు వారీ ఉపాధి కూలీ రూ. 257

- Advertisement -
- Advertisement -

Narega wages now Increase to Rs 257 in Telangana

హైదరాబాద్ : ఉపాధి హామీలో రోజువారీ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో ఉపాధి పనులు చేసేవారికి రోజు వారీ వేతనాన్ని రూ. 245 నుంచి రూ. 257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేతనాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలుల్లోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధిహామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో కొనసాగుతున్న పనులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కూలీల హాజరు, పనుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉదయం పూటే పనులను చేయించాలని, కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News