Monday, November 25, 2024

ఇడి అదుపులో ఎస్‌బిఐ చీటర్

- Advertisement -
- Advertisement -

ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నరేంద్రకుమార్ పటేల్
ఎస్‌బిఐకి రూ. 65కోట్ల టోపీ
అహ్మదాబాద్ విమానాశ్రయంలో గుర్తించి అరెస్టు చేసిన ఇడి అధికారులు
ఇంతకాలం విదేశాల్లో ఉన్న పటేల్

మనతెలంగాణ/హైదరాబాద్: ఎస్‌బిఐ బ్యాంక్‌ను రూ.65 కోట్లు మోసం చేసి ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వ్యాపారవేత్త నరేందర్ కుమార్ పటేల్‌ను శనివారం అహమ్మదాబాద్ విమానాశ్రయంలో ఇడి అధికారులు అరెస్ట్ చేశారు. జయ్ అంబే గౌరి ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి నరేందర్ కుమార్ పటేల్ ఎస్‌బిఐలో రూ.65కోట్ల మేరకు రుణాలు తీసుకుని మోసానికి పాల్పడినట్లు నరేందర్ కుమార్ పై 2015లో అభియోగం నమోదైంది. ఈక్రమంలో ఆరేళ్లపాటు విదేశాలకు పారిపోయిన నరేందర్ కుమార్ పటేల్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇడి అధికారులు గుర్తించి వెంటనే అతన్ని అరెస్టు చేశారు. ఈక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఇడి అధికారులు మూడేళ్లుగా నరేందర్ కుమార్ పటేల్ కోసం గాలిస్తున్న క్రమంలో అతను విదేశాలలో తలదాచుకున్నట్లు తేలింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.65 కోట్లకు పైగా మోసం చేశారనే ఆరోపణలతో హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ ఛైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్, మరో ఎనిమిది మందిపై సిబిఐ కేసు నమోదు చేసినట్లు ఇడి అధికారులు తెలిపారు.వీరిపై 2015లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇదిలావుండగా జే అంబే గౌరీ కెమ్ లిమిటెడ్ 2009 నుండి ఎస్‌బిఐ బ్యాంక్‌ను మోసం చేస్తున్నట్లు ఆరోపణలతో పాటు క్రెడిట్ సదుపాయాలలో క్యాష్ క్రెడిట్, టర్మ్ లోన్, లెటర్ ఆఫ్ క్రెడిట్‌ల రూపంలో నిధులు దుర్వినియోగం చేసినట్లు సిబిఐ అభియోగాలలో పేర్కొంది. ఈ సంస్థ ఖాతా 2014 ఏప్రిల్ 30, 2014 న ఎన్‌పిఎగా మారిన తరువాత సంస్థ మోసం చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణలో ఎస్‌బిఐ బ్యాంక్ అనుమతి లేకుండా కంపెనీ స్టాక్స్ దుర్వినియోగం, నిధుల మళ్లింపు లు జరిగినట్లు తేలింది.

Narender Kumar Patel Arrested in Bank Cheating Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News