కోపెన్‌హాగన్‌లో ఓ వ్యక్తి డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్‌సెన్‌పై జరిపిన దాడిని నరేంద్ర మోడీ శనివారం ఖండించారు.
“డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్‌సెన్‌పై జరిగిన దాడి వార్త పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. మేము దాడిని ఖండిస్తున్నాము. నా ఫ్రెండ్ కి మంచి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాను” అని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి, అయితే కోపెన్‌హాగన్‌లోని సెంట్రల్ పియాజ్జా అయిన కల్టోర్వెట్ స్క్వేర్‌ను దాటుతున్నప్పుడు దుండగుడు ఫ్రెడరిక్‌సెన్‌ను వేగంగా సమీపించి, ఆమెను గట్టిగా నెట్టాడని స్థానిక మీడియా నివేదించింది. ఈ దాడికి సంబంధించి 39 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డెన్మార్క్ ప్రధానికి చిన్నపాటి దెబ్బలు తగిలాయి, అయితే ఘటన జరిగిన తర్వాత ఆమె బాగానే ఉన్నారని ఆమె కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో ధృవీకరించింది.
Denmark's Prime Minister #MetteFrederiksen suffered a whiplash injury in a #streetattack in #Copenhagen#PMModi #Danish #DanishPM #WorldNews #GlobalNews https://t.co/B2auSzqbAj pic.twitter.com/igXXmJLWb5
— News18 (@CNNnews18) June 8, 2024